కంప్యుటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్

Monday, August 22, 2011

కంప్యుటర్  పనిచేసేందుకు అతి ముఖ్యంగా ఉపయోగపడేది ఆపరేటింగ్ సిస్టం .ఇది   లేకుండా  కంప్యుటర్ ను మనం  వినియోగించలేము. మానిటర్, మౌస్, కీబోర్డ్,ప్రింటర్,డిస్క్  డ్రైవ్  మొదలైనటు వంటి వాటన్నింటిని  పనిచేయించేది Os మాత్రమే.

మన కంప్యుటర్లో  MS-Office, Coral draw,Tolly
మొదలైనటు వంటి వాటి  ఉపయోగములోను    ఇదిముఖ్య పాత్ర వహిస్తుంది. ఇది కాకుండా మనం రూపొందించిన ఫైళ్లను డెలీట్,సేవ్,రీనేం,,అప్డేట్,మూవ్ చేయడానికి కూడా ఇది ఉపయోగ పడుతుంది.
రకాలు
 ఏక కాలంలో ఎంతమంది వినియోగస్తులు, ఎన్ని పనులను చేయగలరో దాన్ని బట్టి Os ను ౩ రకాలుగా వర్గీకరించారు. 
  1. ఒక వ్యక్తి       -   ఒక పని(Single User -SingleTask) 
  2. ఒక వ్యక్తి       -   పలు పనులు(Single User-Multi Task)
  3. పలువ్యక్తులు-   అనేక పనులు(MulTi User-MulTi Task)


Single User -Single Task
   ఈ రకమైన OS   ఏక కాలంలో  ఒక  పనిని ఒక వ్యక్తి మాత్రమే  చేసేందుకు అనుమతిస్తుంది..మరొక పనిని చేయదలిస్తే ఇంతక ముందు చేస్తున్న పనిని  ముగించి యండాలి లేదా దానిని అక్కడతో ఆపి వేయాలి. అప్పుడే మరొక పనిని చేయగలము. డాస్ (Dos Operating System) ఇందుకు ఉదాహరణ.

Single User-Multi Task
  ఈ రకమైన OS   ఏక కాలంలో   ఒక వ్యక్తి  ఎన్ని పనులైనా  చేసేందుకు అనుమతిస్తుంది. ఇందుకు విండోస్(Windows) చక్కని ఉదాహరణ.

MulTi User-MulTi Task 
  ఈ రకమైన OS   ఏక కాలంలో పలు వ్యక్తులు(వినియోగదారులు) వాళ్లకు అవసరమైన అనేక పనులకై వినియోగించేందుకు  అనుమతిస్తుంది. యునిక్స్(Unix),లినక్స్(Linux), విండోస్ సర్వర్ (Windows server) ఇందుకు ఉదాహరణ.

ఆపరేటింగ్ సిస్టమ్స్ రకాలు:
Dos Operating System
 ' డాస్ '  Os పలు  పేర్లతో, పలు సంస్థలతో రూపొందించబడి ఉపయోగింపబడెను. అన్ని సాధారణ వినియోగానికై రూపొందించబడినవి  కావు.  ఒక ప్రోగ్రాం రూపొందించడమే చాలా కష్టం అప్పట్లో.ఇప్పుడు  కూడా మన OS లో ఇది ఉంది. అందుకు మన కంప్యుటర్లో  Start->Run ను   క్లిక్ చేసి అందులో  cmd అని టైపు చేస్తే 'Ms-Dos'  కనిపిస్తుంది. ఇప్పుడు కూడా 
fileల వినియోగంలో  కొందరు దీనినే వినియోగిస్తున్నారు.

 Windows
'Microsoft' అనే సంస్థ ఈ ఆపరేటింగ్ సిస్టం  ను రూపొందించినది.
 ప్రపంచ వ్యాప్తంగా 90 % కంప్యూటర్లలో ఈ OS నే వినియోగిస్తున్నారు. ఇందులోనే నేడు మనకు అనేక వెర్షన్స్ లభ్యమవుతున్నాయి. వాటి గురించి కొద్దిగా తెలుసు కుందాం..   

Windows 1.0
 1983 లోనే విండోస్ యొక్క మొదటి వెర్షన్ బయటకు వస్తుందని      'Microsoft' ప్రకటించినప్పటికీ  కొన్ని కారణాల వలన 1985 లోనే ఇది వాడుకలోకి వచ్చింది. 'Ms-Dos' కు కొనసాగింపుగా వచ్చిన ఇది విజయం సాధించలేక పోయింది.  
 Windows 2.0
ఆపిల్  సంస్థతో  ఒప్పందం చేసుకొని  ఆపిల్  సంస్థ విడుదల చేసిన 'మాక్' (mac)  Os యొక్క కొన్ని సదుపాయాలతో  విండోస్ 2.0 కొనసాగింపుగా  1987 లో పరిచయం చేసింది 'మైక్రోసాఫ్ట్' సంస్థ.   
Windows 3.0
  మే 22,1990 లో  ఇది విడుదల   చేయబడింది. గుర్తుంచుకోదగిన విధంగా కొత్తరూపంతో, అనేక వసతులతో దీనిని  రూపొందించారు.   ఇదే విండోస్  యొక్క విజయవంతమైన ఎడిషన్. 2 సంవత్సరాలలోనే దాదాపు  1 కోటి వరకు CD'S అమ్ముడైనవి. దీని తర్వాత నుండే 'మైక్రోసాఫ్ట్' సంస్థ తన విండోస్ ఆపరేటింగ్ సిస్టంపై  మార్కెట్లో దృష్టి సారించింది.

Windows 3.11
 విండోస్ 3.0 ను  నవీనకరించిన ఎడిషన్ ఇది. 'మల్టిమీడియ'(multimedia) సదుపాయాలతో  దీనిని 1991 లో  విడుదల చేసింది.
 Windows 3.1 
   ఏప్రిల్   1992 లో  విడుదల  చేయబడింది. ఇది విడుదలైన  2 నెలలోనే సుమారు 10 లక్షల CD'S వరకు అమ్ముడై సాధన నెలకొల్పెను.
Windows